వజ్రాల నగలు అందరికీ ఇష్టమే. కానీ ఖరీదు రిత్యా అందరికీ ఇవి అందుబాటులో ఉండవు. వజ్రాల నగలు ఇష్టపడే వాళ్ళ కోసం సింథటిక్ డైమాండ్స్ తయారయ్యాయి. ఈ రాళ్ళ మెరుపు పారదర్శకత అచ్చం వజ్రాల్లాగే ఉంటాయి. కార్బన్ అణువులను ప్రయోగశాలలో ఎక్కువ పీడనం అధిక ఉష్టోగ్రతకు గురి చేయటం ద్వారా శాస్త్రవేత్తలు ఈ కుత్రిమ వజ్రాలు సృష్టించారు. బోలెడన్ని రంగులు రూపాల్లో ఈ వజ్రాలు దొరుకుతాయి. బంగారు నగలు కొనుకున్నట్లే వీటిని కొనుగోలు చేయవచ్చు. వజ్రాల వ్యాపారంలో అంతర్జాతీయా ఖ్యాతి కలిగిన డీ బీన్స్ సంస్థతో పాటు ఇంకొన్ని సంస్థలు ఈ సింథటిక్ వజ్రాలు సృష్టిస్తున్నారు.

Leave a comment