క్రిస్మస్ తో మొదలుపెట్టి కొత్త సంవత్సరం వచ్చే దాకా ఇది కేకుల సీజన్ .పంచదార ,రైస్ పేపర్లతో చేసిన సహజమైన పూవులు ,పిట్టలు అలంకరిస్తే కేక్ తయారయిపోతుంది. ఇప్పుడు వస్తున్న కేక్ లు మాస్టర్స్ తయారు చేస్తున్నారు. సైపింగ్ బ్యాగ్ లు ,సిరంజిలు ఉపయోగించి,బటర్ క్రీమ్ ఐసింగ్,పంచదార ఐసింగ్ తో పాటు బాస్కట్ వీల్ డాటెడ్ స్విస్ వంటి పంచదార టెక్చర్ తో కేక్ రూపం మారిపోయింది. అందమైన బొకేలు ,ఇంచక్కని అమ్మాయిలు, పరుపులు,మంచాలు ,కుక్కులు,పిల్లి బొమ్మలతో కేక్ కళా ఖండాలు వచ్చేశాయి. రెయిన్ డ్రీప్ కేక్ లు పారదర్శకంగా ఉండే జెల్లీతో కేకుల్ని తయారు చేస్తున్నారు. పెయింటింగ్ లో ఆరితేరిన వాళ్ళు స్టెయిన్ గ్లాస్ మెరుపుతో అందాల్ని కేకులకు అద్దేసి పూల గుత్తులు ,బంగారు బిస్కెట్లు ఉద్యాన వనాలు సృష్టిస్తున్నారు. కేకు రుచి ,రూపం రెండూ మారిపోతాయి.

Leave a comment