Categories
కృతజ్ఞత తో ఉన్న వారికి అన్నీ వాటంతట అవే అందుతాయి అంటారు పెద్దలు మనం అందుకొన్న ప్రతి దానికీ థాంక్స్ చెప్పి తీరాలి తన విజయం వెనక తన ముందు తరం పరిశోధకుల పాత్ర ఉందని ఐస్ స్టీన్ అంతటివాడు స్మరించుకున్నాడు. క్రీడాకారిణి గెలుపులో కోచ్ పాత్ర, సినిమా సక్సెస్ లో దర్శకుని పాత్ర..ఇలా సాయపడిన అందరికీ స్మరించుకోవడం అంటే కృతజ్ఞతలు చెప్పుకోవడమే.మన జీవితంలో తల్లిదండ్రులు, తోడ బుట్టిన వారు స్నేహితులు, బంధువులు ఇలా సంతోషం కలిగించిన వారు సహాయపడేవారు ప్రేమను పంచే వాళ్ళు ఉంటారు. ఎప్పటికప్పుడు అందరికీ కృతజ్ఞతలు చెప్పాల్సిందే. చక్కని సూర్యోదయలకు, చల్లని గాలికి ప్రాణాధారమైన వాతావరణానికీ సారవంతమైన నేలకీ మొలకెత్తే విత్తనానికి పండు కీ పువ్వుకీ దొరికే స్నేహ స్పర్శకి అయిచితంగా కురిసే ప్రేమకు అన్నింటికీ వేయి వేల కృతజ్ఞతలు చెప్పేస్తే జీవితం అద్భుతంగా సాగుతుంది.
చేబ్రోలు శ్యామసుందర్
9849524134