విటమిన్- సి సమృద్ధిగా ఉండే నిమ్మ పండు మంచి రోగనిరోధక బూస్టర్ కూడా.నిమ్మ చెట్టు ఇప్పుడు ఇంట్లో కుండీల్లో కూడా పెంచుకోవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్.వెడల్పుగా ఉండే కుండీని వర్మీ కంపోస్ట్,ఆవు పేడ సేంద్రీయ ఫీడ్ ,మట్టి ఇసుక తో నింపి నిమ్మ మొక్క నాటుకోవచ్చు.ఈ మొక్కకు సూర్యరశ్మి ఎక్కువగా కావాలి. ప్రతి రోజు నీరు అవసరం లేదు రెండు మూడు రోజులకు ఒకసారి  నీరు పోస్తే చాల విత్తనాలు లేని నిమ్మకాయలు కూడా ఈ కుండీలో పండించవచ్చు.రెండేళ్ళలో కాయలు కాస్తాయి పువ్వులు చిన్నవిగా అనిపిస్తే తేనెటీగలను ఆకర్షించేందుకు పువ్వుల పైన కాస్త తేనె చిలకరించాలి రెండేళ్ల నుంచి మొదలు పెట్టి ఇక ఏడాది పొడవునా ఫలాలను ఇస్తుంది. బాల్కనీలో ఒక నిమ్మ చెట్టు ఉంటే ఆరోగ్యం చేతుల్లో ఉన్నట్లే.

Leave a comment