లాఫర్ ఈజ్ ది బెస్ట్ మెడిసిన్ అంటారు (Laughter is the best medicine)నవ్వు కొన్న ప్రాధాన్యత భౌతిక మానసిక ఆరోగ్య లలో ఎంతో గణనీయమైనదని చెపుతారు.ఈ మధ్యకాలంలో నవ్వును  ఒక వ్యాయామంగా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు.ఎన్నో లాఫింగ్ క్లబ్ లు నడుస్తున్నాయి.భౌతిక ఆరోగ్యానికి నవ్వు సాయపడుతుంది. ఒత్తిడి ఆందోళన తగ్గిస్తుంది ఆరోగ్యకరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందింపజేసే యాంటీబాడీస్ ఉత్పత్తి చేస్తుంది. సామాజిక స్థాయిలో మంచి సంబంధాలు పెంపొందింప జేసుకునేందుకు నవ్వు ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలు నవ్వినంత గా,యువత  నవ్వినంతగా   వయసు పెరుగుతున్న వాళ్లు నవ్వరు ఒక వయసులో ప్రతిదీ నవ్వు తెప్పిస్తోంది.పెద్దవాళ్లు కూడా నవ్వాలి నవ్వుతూ ఉంటేనే ఆరోగ్యం నిత్య జీవితంలో హాస్యోక్తులు జోక్స్ భాగంగా ఉండాలి.నవ్వు అంటే లోపల నుంచి వచ్చే ఆనందం. ఆ ఆనందం మన లోపలే ఉత్పత్తి అవుతోంది.వస్తువుల్లో ఆనందం దుఃఖం ఉండవు అన్ని భావాలకు నిలయం మనిషే.
 చేబ్రోలు శ్యామసుందర్ 
9849524134 
 

Leave a comment