కోయంబత్తూర్ దగ్గర  తొప్పంపట్టి పూంగానగర్ కు చెందిన 86 ఏళ్ల నంజమ్మాళ్ ను వెజిటేబుల్ బామ్మా అంటారు. 200 కుటుంబాలు ఉన్న ఆ ఊర్లో ఓ సారి రక్త పరీక్షలు చేస్తే అందరికీ రక్తహీనతే సమస్య. అప్పుడు బామ్మ ఆ ఊర్లో అందరి ఇళ్లలోనూ  కూరగాయలు, పండ్ల మొక్కలు వేసి వాటి సంరక్షణ బాధ్యత తనే తీసుకుంది. సొంతంగా సేంద్రియ ఎరువు తయారు చేసి అందరి ఇండ్ల పెరట్లో చల్లుతుంది. నంజమ్మాళ్ ను ఆదర్శంగా తీసుకొని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ ఇళ్లలో మొక్కల పెంపకం మొదలుపెట్టారు.

Leave a comment