Categories

జమున టుడు ను లేడీ టార్జాన్ ఇండియా గా పిలుస్తారు. ఒరిస్సా లోని రాయి రంగాపూర్ లో పుట్టిన జమున పెళ్లయ్యాక జార్ఖండ్ లోని మాతుకం కు వచ్చింది. ఆ ఊరు చుట్టూ పచ్చని అడవిని స్మగ్లర్లు నరికి వేయడం గమనించిందామె. అడవిని కాపాడుకోవడం కోసం వన సురక్ష సమితి ని ఏర్పాటు చేసింది. కేవలం ఐదుగురు మహిళలతో మొదలైన ఈ సమితి లో ఇప్పుడు పదివేల మంది మహిళలు ఉన్నారు. వీరంతా కలిసి 50 హెక్టార్ల అడవిని కాపాడారు. కత్తులు, బాణాలు చేతబట్టి నక్సల్స్ మాఫియా ను కూడా అడవిని నరికి పారేయకుండా అడ్డుకున్న జమునకు పద్మశ్రీ అవార్డ్ బహుకరించింది ప్రభుత్వం. ఆమెను అన్ని దేశ విదేశీ అవార్డ్ లు వరించాయి.