వేల మంది విద్యార్థులకు పాఠాలు చెబుతూ రెండుసార్లు బెస్ట్ టీచర్ అవార్డ్ అందుకోవటమే కాక తన రచనలతో దళిత్ మహిళలను జాగృత పరుస్తున్నారు అనిత భారతి. 2003లో దళిత్ ఉమెన్ పేరిట రచనలు చేయటం ప్రారంభించిన అనిత భారతి. 2012 లో హిందీ లో కంటెం పరరీ ఫెమినిస్ట్ అండ్ దళిత్ ఉమెన్ రెసిస్టెన్స్ పేరుతో ఒక పుస్తకం విడుదల చేసింది. ఈ పుస్తకం బీబీసీ టాప్ -10 పుస్తకాలలో ఒకటి. కదమ్ దళిత్ సెంటర్ ద్వారా దళిత్ మహిళల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నారు. దళిత్ రైటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా అలాగే దళిత్ మహిళల సమస్యల పై పోరాడే థియేటర్ గ్రూప్ లో భాగస్వామి.