బాల్యం ఎవరికైనా చక్కని అనుభూతులనే ఇస్తుంది. ఆ తెలియని వయసులో అల్లరి తలుచుకుంటే ఇప్పుడు నవ్వోస్తుంది. స్నానల గదిలోకి ఎవరైనా వెళితే చాలు తలుపు పెట్టేసేదాన్ని. వాళ్ళు అరిచి తిడుతున్న తీసేదాన్ని కాదు. చేతిలో నాణాలు ఉంటే చాలు మింగేసేదాన్ని. మా అమ్మను ఎంత కంగారుపెట్టేదాన్నో అంటుంది కీర్తి సురేష్. ఆమే సావిత్రిగా నటించిన మహానటి చిత్రీకరణ పూర్తయింది. చిన్నప్పుడు గోడవ చేసినా అందరితో చాలా కలివిడిగా ఉండేదాన్ని, అది నాకు చిత్రసీమలో పనికి వచ్చింది. నాకు సంబంధం లేని వాతవరణంలో వెంటనే ఇమిడిపోయేందుకు నా చిన్నతనపు అలవాట్లు పనికి వచ్చాయి. మహానటిలో అంత బరువైన పాత్రలోంచి నేను బయటకు వచ్చేందుకు పనికి వచ్చినవి నా చిన్నతనపు జ్ణాపకాలే. ఆ అల్లరి తలుచుకోని నేను చాలా రిలాక్స్ అయ్యాను అంటుంది కీర్తి సురేష్.
Categories