కరోనా లక్షణాలతో వచ్చే వారికి మోనా చికిత్స చేస్తుంది ప్రతి రోజు ఆమె మారథాన్ లో  పరుగులు తీస్తోంది అంటున్నారు.  ది ఫ్లయింగ్ సిఖ్ మిల్ఖా సింగ్ ఆయన కూతురు మోనా మిల్ఖా సింగ్ న్యూయార్క్లోని మెట్రోపోలిటియాన్ హాస్పిటల్ సెంటర్ లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ వార్డ్ లో ఫిజిషియన్ గా సేవలందిస్తున్నారు.లక్షల్లో బాధితులు ఆస్పత్రులో  చనిపోతున్నారు. నాలుగు లేయర్ల ప్రొటెక్టివ్ సూట్  ధరించి రోజులో 12 గంటల పాటు ఆస్పత్రిలో గడుపుతోంది మోనా మిల్కా సింగ్.ఆమె పని చేసే ఆసుపత్రుల్లో 111 ఐ సి యు బెడ్ లు ఉన్నాయి  ఎమర్జెన్సీ కేసులు మోనా హ్యాండిల్ చేస్తున్నారు. ఆమెను చూస్తూ ఉంటే మాకు ఎంతో గర్వంగా ఉంది అంటున్నారు ఆమె సోదరుడు జీవ్  మిల్ఖా సింగ్. మోనా మిల్ఖా సింగ్ ఎందరికో స్ఫూర్తి.

Leave a comment