Categories
మనం ఇచ్చే సమాచారంతో మన పైనే వ్యాపారం జరుగుతుంది తెలుసా. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన చర్చలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా 14 ఉన్నత స్థాయి పారిశ్రామిక సామాజిక సాంకేతిక వర్గాలకు చెందిన 26మంది నిపుణులు పాల్గొన్నారు. వీరి విశ్లేషణలతో మాలిషియన్ యూజ్ ఆఫ్ ఏఐ అనే పేరిట ఒక నివేదిక వచ్చింది. ఈ సాంకేతిక యుగంలో గోప్యత లేదు, వాట్సాప్,ఫేస్ బుక్, గూగుల్ వంటి యాప్స్ కి మనం ఇచ్చే మన వివరాలు ముడి సరుకుగా అమ్మేస్తున్నారు . ఒక్క ఫేస్ బుక్ లోనే మన దేశంలోని ఐదున్నర లక్షల మందితో సహా 8.7 కోట్ల మందికి చెందిన సమాచారం పెయిడ్ మెటిరియల్ అయ్యిందని తాజాగా ఫేస్ బుక్కే ఒప్పుకుంది. దేనికి పడితే దానికి అడిగే ప్రతి ప్రశ్నకు ఒకే నా ఫోన్ లో మొత్తం వాడుకొండి అని చెప్పేయకండి జాగ్రత్త.