Categories
లెఫ్టినెంట్ సుప్రియా చౌదరి రాజస్థాన్ నుంచి టెరిటోరియల్ ఆర్మీలో ఆఫీసర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ. జాతీయ స్థాయిలో రెండవ టెరిటోరియల్ ఆదర్శ మహిళా ఆఫీసర్ కుడా. రెగ్యూలర్ ఆర్మీ తర్వాత స్థానం టెరిటోరియల్ ఆర్మీదే. భారత సైన్యంలో ఇది ఒక భాగంగా పని చేస్తుంది. దీనిలో పని చేసే వారికి ప్రతి సంవత్సరం ఇండియన్ ఆర్మీ ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. మన దేశంలో టెరిటోరియల్ ఆర్మీలో రెండు లక్షల మంది సైనికులున్నారు. ఇందులో ఒకే ఒక్క మహిళ సుప్రియా చౌదరి. సైంటిస్టుగా పని చేసిన సుప్రియా ప్రస్థుతం ఆంక్లేశ్వర్ లోని చమురు సహజ వాయువుల కార్పోరేషన్ లో సీనియర్ ఆఫీసర్ కార్యాలయంలో పని చేస్తుంది.