మాటలెంత బావుండాలి అంటే అవి చక్కని సువాసన లాగా ఎదుటి వాళ్ళను చుట్టుముట్టాలి.మా మానవ సంబంధాలను నెలకొల్పటంలో కొనసాగించటం లో మంచి మాటకు ప్రథమ స్థానం బాగా మాట్లాడ గలగటం ఒక ఆర్ట్ ఏదో ఒకటి మాట్లాడటం కంటే ఏం మాట్లాడుతున్నాం అన్న విషయంలో అదుపు ఉండాలి. మాటలు చిరాకుగా, వ్యంగంగా ఉండకూడదు ఎదుటి మనిషి మొహం పైన నవ్వు చెదిరిపోయే మాటలు మాట్లాడకూడదు.ఏ సబ్జెక్ట్ మాట్లాడిన,ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. టాపిక్స్ మూడ్ మార్చేవిగా ఉండకూడదు. అన్నీ మనకే తెలుసుననే మొండి వాదన వద్దు. కొన్ని విషయాల్లో ఎదుటి వాళ్ళ కంటే అధికులు కావచ్చు కానీ అనుక్షణం ఆ విషయాన్ని ఎత్తి చూపిస్తూ మాట్లాడకూడదు. కబుర్లాడు కునే ప్లేస్ యుద్ధభూమి కాకూడదు.నిజాయితీగా మాట్లాడాలి మనకి నచ్చితే వెంటనే పొగడాలి విమర్శించే అవసరం వచ్చినా అది ఎదుటి వాళ్ళను గాయపరిచే కటువైన మాటలు వాడకూడదు.మాటలు పుల్ల విరిచినట్లు కాక పువ్వు విరిసినట్లు ఉండాలి.

చేబ్రోలు శ్యామసుందర్  
9849524134 

 

Leave a comment