వర్క్ వుట్స్ చేయడానికి అరగంట ముందు కొద్ది మొత్తం లో పోషకాహారం తీసుకోవాలి. ఇలా తీసుకునే ఆహారంలో ప్రోటన్లు, కార్బోహైడ్రేట్స్ ఉండేలా జాగ్రత్త పడాలి.రెండు ఉడికించిన కోడి గుడ్లు వ్యాయామానికి ముందు తింటే నిస్సత్తువ అనిపించదు.బరువు పెరిగే ప్రమాదం కూడా ఉండదు అలాగే రెండు అరటి పండ్లు తిన్న ఉత్సాహంగా వర్క్ వుట్స్ చేయవచ్చు.ఫైబర్ శాతం అధికంగా ఉండే ఓట్స్ మీల్  తింటే వర్క్ వుట్స్ చేసేప్పుడు ఎనర్జీ లెవెల్స్ సిద్ధంగా ఉంటాయి. అలాగే చక్కెర కలపని పండ్లు రసాలు కూడా తక్షణ శక్తి ని ఇచ్చేవే.

Leave a comment