చల్లని వాతావరణం తో దోమలు, ఈగలు వచ్చేస్తాయి.సాయంత్రం వేళ ఇంట్లో కర్పూరం వెలిగించి తలుపులు మూసేస్తే ఆ వాసన ఇల్లంతా ఉంటుంది.పదినిమిషాల తర్వాత తలుపులు తెరిస్తే దోమలు రావు.అలాగే వెల్లుల్లి వాసనకు దోమలు రావు.నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు దంచి పావు కప్పు నీళ్లలో మరిగించాలి ఆ నీటిని చల్లితే దోమలు రావు.ఒక కాళీ సీసాలో నీళ్లు పోసి అందులో నారింజ తొక్కలు వేసి ఆ నీటిలో యూకలిప్టస్,నిమ్మ నూనె రెండు చుక్కలు వేయాలి.ఆ నీటిలో తేలే లాగా చిన్న ఫ్లోటింగ్ క్యాండిల్ వెలిగిస్తే ఇందులో ఉండే నూనెల పరిమళంతో దోమలు రావు.ఉప్పు వేసిన నీళ్ళతో వంటింటి అరుగులు తుడిస్తే ఈగలు రాకుండా పోతాయి. ఇల్లు తుడిచే నీళ్ళలో కూడా ఓ స్పూన్ ఉప్పు కలిపితే ఈగలు వాలకుండా ఉంటాయి.

Leave a comment