మనకు టీ అంటే టీ నే. టీ పొడి, పంచదార, ఓ యలక్కాయో, అల్లమో ఇంతే కదా. కానీ ఆకులు, పువ్వులు, గింజలు, వేళ్ళతో కూడా రకరకాల టీలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలని పోగొడతాయి. నిద్ర సరిగా పట్టక పొతే రెండు స్పూన్ల ఎండిపోయిన చమేలి ఆకుల్ని నీళ్ళల్లో మరిగించి చమేలి టీ తాగితే మంచి నిద్ర పడుతుందిట. బ్లాక్ టీ లో వుండే కెఫిన్ వల్ల అలసట తగ్గిపోతుందిట. రోజు రెండు సార్లు తాగితే ఓత్తిడి తగ్గించే హార్మోన్ల స్థాయి తగ్గుతుంది. జలుబు, దగ్గు వుంటే గ్రీన్ టీ లో తేనె నిమ్మకాయ కలిపి తాగితే బాగుంటుంది. కాఫి తాగే వాళ్ళతో పోలిస్తే టీ తాగే వాళ్ళల్లో రోగ నిరోధక శక్తి ఐడు రెట్లు ఎక్కువని అధ్యాయినం రిపోర్టు. గ్రీన్ టీ లో వుండే టాక్సిన్లు, ఫ్లోరైడ్ వంటివి దంతక్షయం, వ్యర్ధల్ని తగ్గిస్తాయి. కదలకుండా 12 గంటలు పని చేసే వాళ్ళలో వుండే ఓత్తిడి, టీ ఆకుల తో పాటు వాము, అల్లం కలిపి టీ తాగితే ఆ సమస్య వుండదు. బలహీనమైన ఎముకులుంటే వైట్ టీ తాగాలి ఇందులోని ఫైటో కెమికల్స్ నొప్పిని తగ్గిస్తాయి ఎముకల్ని బలంగా ఉంచుతాయి.
Categories