అరణ్య సంరక్షణ కోసం ప్రముఖ పర్యావరణ వేత్త సుప్రభా శేషమ్ నడుము కట్టారు అంతరించి పోతున్న పశ్చిమ కనుమల అడవుల పరిరక్షణ కోసం కేరళలోని వయనాడ్  ప్రాంతంలో గురుకుల బొటానికల్ శాంక్చరీ జర్మనీ పర్యావరణ వేత్త వోల్స్ గాంగ్ ధియర్ కాప్ శ్రీకారం చుట్టాడు. మూడు దశాబ్దాలుగా ఆయనతో కలిసి అడవి పరిరక్షణ చేస్తున్నారు సుప్రభా. మహిళ దళాన్ని ఏర్పాటు చేసి అడవిని 75 ఎకరాలకు విస్తరించేలా చేశారు. పర్యావరణానికి జీవితాన్ని అంకితం చేసిన సుప్రభా శేషమ్ కు వైట్లి అవార్డు ఫర్ నేచర్,శాంక్చరీ ఫౌండేషన్ నుంచి గ్రీన్ టీచర్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు ఎన్నో వచ్చాయి.

Leave a comment