తీరిక లేని పని తర్వాత ఏ పార్టీకో వెళ్లాలంటే మొఖం అలసటగా ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఫ్రీజ్ నుంచి తీసిన చల్లని నీళ్ళతో మొఖం కడుక్కోవాలి. దీనితో ముఖం కండరాలు బిగుసుకుని మృదువుగా కనిపిస్తాయి. ఐస్ ముక్కలు వేసిన పాలతో మొఖన్ని కాసేపు రుద్దితే చర్మానికి తేమ అందుతుంది. అలాగే ఒక స్పూన్ ఫ్రీజ్ లో పెడితే చల్లగా ఐపోతుంది. ఈ స్పూన్ ను పదే పదే చల్లబరుస్తూ కళ్ళ పైన పెట్టుకుంటే కళ్ళ అలసట తీరిపోతుంది. కన్సీలర్ ను కళ్ళకింద అద్దుకుని సెట్టింగ్ పౌడర్ అద్దుకోవచ్చు. కీర దోస, గుళాబీ నీళ్ళలో తుడిచిన దూదిని కళ్ళ పై ఉంచుకున్న మొహంలో అలసట పోతుంది.

Leave a comment