Categories
ప్యాబ్ వర్క్ ఏనాటిదో . కవుడీ పేరుతో కర్నాటకలో ఈ ప్యాబ్ వర్క్ చేసిన బొంతలు చాలా ప్రత్యేకం. రంగురంగుల చీరెలను కలిపి ,ముక్కలు కత్తిరించి ప్యాబ్ చేసి బొంతలు కుట్టడం చాలా ప్రత్యేకం . గుడ్డ ముక్కలతో పువ్వులు కుట్టి వాటిని దుస్తులపైన కుట్టడం కూడా ఎప్పటి నుంచో వుంది. ఈ అందమైన ప్యాబ్ వర్క్ ఇప్పుడు సాదా చీరెల పైకి ఎక్కి అతి మామూలు చీరెలకు అపూర్వమైన అందాన్ని ఇస్తోంది. వేసవి కాటన్ లకు ఈ ప్యాబ్ వర్క్ తోడైతే ఇంకాస్త ప్రత్యేకం . సాదా చీరెలకు కలంకారీ ప్యాబ్ వర్క్ అంచులు, అదే రకం బ్లవుజ్ ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్. టస్సర్, మల్ కుల్, కోవాఖాదీ వంటి చేనేతలకు ధైడ్ ఎంబ్రయిడరీ ఫ్యాబ్ ను జోడిస్తే అందమైన పార్టీ వేర్ తయారవుతుంది.