ప్యాకెట్లలో లభించే పాశ్చరైజ్డ్ పాలు వేడి చేయకుండా తాగవచ్చా అని హాస్టల్స్ లో ఉండే విద్యార్థులు సందేహ పడుతూ ఉంటారు. కొన్ని రకాల హానికారక సూక్ష్మజీవులు నశించే పాలను అత్యధిక ఉష్ణోగ్రత వద్ద కాసేపు వేడి చేసి చల్లార్చి ప్యాక్ చెయ్యటాన్ని పాశ్చరైజ్డ్ పాలు అంటారు. ఇలాంటి పాలను సరైన ఉష్ణోగ్రత లో ఫ్రిజ్ లో ఉంచితే రెండు రోజుల పాటు సురక్షితంగానే ఉంటాయి. అయితే ప్యాకింగ్ తర్వాత ఇంటికి చేరేందుకు కొన్ని గంటల వ్యవధి ఉంటుంది కనుక వాటిని తిరిగి వేడి చేసి తాగితే మంచిది అంటున్నారు ఎక్సపర్ట్స్ .

Leave a comment