సంవత్సరం దాటిన పిల్లల్లో ఇమ్యూనిటీ పెరిగేందుకు కొన్ని రకాల ఆహారాలు ఇవ్వమంటున్నారు నిపుణులు. పదినెలలు దాటినా పిల్లలకు  అన్నంతో పాటు ఉడికించిన కూరలు కలిపి తినిపించాలి. ఆకు కూరలతో పాటు,బ్రొకోలి,కాలిఫ్లవర్,క్యాబేజి వంటివి మెత్తగా ఉడికించి అన్నంతో కలిపి పెట్టాలి. కంది పెసరపప్పు అన్నంతో కలిపి ఉడికించాలి. స్పూన్ నెయ్యి కలిపి తినిపిస్తే పోషకాలు అందుతాయి. యాపిల్ మెత్తగా ఉడికించి తినిపించవచ్చు. సీజనల్ పండ్ల రసాలను రెండు మూడు స్పూన్ లు ఇవ్వాలి. వాటిలోని పీచు జీర్ణ శక్తిని పెంచుతుంది ఎదిగే పిల్లలకు పెరుగు చాలా మంచిది.

Leave a comment