Categories
బి.పి కి సంబధించి చాలా అధ్యయానాలు జరుగుతున్నాయి. పగటి వేళ కాసేపు నిద్ర పోవటం ద్వారా శరీరం పునరుత్తేజం పొంది మనసు ప్రశాంతంగా ఉండి బి.పి సమస్య దాదాపు తగ్గిపోతుంది అంటున్నారు న్యూజెర్సీ లోని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్టియాలజి పరిశోధకులు. 60 ఏళ్ళకు పైబడిన 200 మంది పైన ఈ అధ్యయనం నిర్వహించారు.వారికి మద్యహ్నం కాసేపు నిద్ర పోవాలని చచెప్పారు. అలా ఎంపిక చేసిన వారిని నిద్ర నుంచి లేచాక పరీక్షించి చూస్తే బ్లడ్ ప్రెజర్ రీడింగ్ లో చాలా తేడా కనిపించింది.వాళ్ళు చాలా ప్రశాంతంగా కనిపించారు. ఈ కాసేపు కునుకుతో హృద్రోగాలు వచ్చే సమస్య తీరిపోతుంది అంటున్నారు అధ్యయనకారులు.