పువ్వులతో చేసిన ఫేస్ మాస్క్ లు ఒళ్ళంతా పుల పరిమళం నింపాతాయంటున్నారు ఎక్స్పర్ట్. మందార పువ్వులు చర్మానికి టోనర్ గా పనిచేసి నిగారింపునిస్తాయి.ముల్తాని మట్టి ,ఎండిన మందార పువ్వుల పొడి ,తేనె,యోగర్ట్ కలిపి పేస్ట్ లా చేసి ఫేస్ ప్యాక్ వేసుకొంటే ట్యాన్ సమస్య తగ్గిపోతుంది. పొద్దు తిరుగుడు పువ్వులు లేదా గింజలు వీటిని ఫేస్ ప్యాక్ కోసం ఉపయోగించవచ్చు. గింజల్ని రాత్రంతా నీళ్ళలో నాననిచ్చి ఉదయం మెత్తని పేస్ట్ లా చేసి కాస్తా పుచ్చకాయ రసం ,రోజ్ వాటర్ కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖ కాంతి మెరుగు అవుతుంది. మల్లె పువ్వుల్ని ఎండనిచ్చి పొడిగా చేసి ఈ పొడిలో యోగార్ట్ కలబంద రసం కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఇది చర్మానికి మంచి టోనర్ గా ఉపయోగపడుతుంది. గులాబీ,బంతి,కమలాలు కూడ ఫేస్ ప్యాక్ కోసం ఉపయోగించవచ్చు.

Leave a comment