విస్లావా సింబోర్స్కా నోబెల్‌ బహుమతి పొందిన మొదటి పోలెండ్‌ కవయిత్రి. ఈమె 1923వ పశ్చిమ పోలెండ్‌లోని కోర్ణిక్‌ పట్టణంలో జన్మించింది.విస్లావా సింబోర్స్కా తండ్రి మంచి పాఠకులు ఎన్నో పుస్తకాలు చదివి ఇంట్లో చర్చించేవాడు.తండ్రి ప్రభావం తోనే విస్లావా అయిదేళ్ళ వయసు నుంచే కవితలు రాసింది.1945 నుండి 1948 వరకు జగియెలోనియన్‌ విశ్వవిద్యాలయంలో పోలీష్‌ ప్రాచీన భాషాశాస్త్రం, సామాజిక శాస్త్రం చదువుకొంది.1952లో ‘అందుకనే మనం బతికున్నాం’ శీర్షికన మొదట కవితా సంకలనం వచ్చింది.ఆమె కవితా ధోరణి చాలా స్పష్టంగా, సూటిగా, ఉంటూ పాఠకులను ఆకట్టుకొన్నాయి.1996లో విస్లావాకు ఆమె కవితలకు నోబెల్ బహుమతి పొందింది.

Leave a comment