మన దేశంలో కార్తీక పౌర్ణమి రోజున నీళ్లలో దీపాలు వదులుతూ పూజలు చేస్తుంటారు. ఇలాంటి ఆచారాలు ప్రతి దేశం లోనూ ఉన్నాయి వియత్నాంలోని నుయ్ రివర్ లో ప్రతి పౌర్ణమి కి అమ్మాయిలు ప్రత్యేక దుస్తుల్లో తయారై పడవ తీసుకొని నదిలోకి వెళతారు. రాబోయే రోజులు ఆనందంగా గడపాలని కోరుకుంటూ దీపాన్ని వరుసగా నీళ్లలో వదులుతారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఈ సాంప్రదాయ వేడుకలు చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు. నిండు పున్నమి వేల వెన్నెల్లో దీపాలు చాలా అందంగా కదులుతాయి.

Leave a comment