హ్యాపీ హాండ్స్ ఫౌండేషన్ స్థాపించి 12 రాష్ట్రాలకు చెందిన విభిన్న కళాకారుల ఉత్పత్తులను ఆన్ లైన్ లో ప్రపంచ వ్యాప్తి ప్రేక్షకులకు చేరువ చేస్తోంది మేధావి గాంధీ. కల కోసం పాటుపడిన మరుగున పడిపోయిన అలనాటి మహిళా మణుల కథలను తన వెబ్ సైట్ హెరిటేజ్ ల్యాబ్ ద్వారా వెలుగులోకి తెస్తోంది.మ్యూజియంలో, గ్యాలరీలోని కళాఖండాలు చూడాలంటే  ఆన్ లైన్ లో కనిపించవు అందుకు వర్చువల్ గ్యాలరీ ఒక్కటే మార్గం కళా ప్రేమికులకు కనువిందు చేయాలనే ఉద్దేశంతో నేను హెరిటేజ్ ల్యాబ్ కు రూపకల్పన చేశాను అంటోంది మేధావి గాంధీ.ఈ వెబ్ సైట్ ద్వారా పురాతన పెయింటింగ్స్ కు అధునాతన సాంకేతికతను జోడించి జిఫ్ఫీలు లు మీమ్స్ సృష్టిస్తూ కళాత్మతను కొత్త రూపంలో ఆవిష్కరిస్తోంది.

Leave a comment