సినిమా చిత్రీకరణ వెనుక ఎంతో శ్రమ ఉంటుంది. ఉదాహరణకు పద్మావతి సినిమా లో దీపిక ధరించిన 150 రకాల నగలు 200 మంది 600 రోజులు కష్టపడి 400 కిలోల బంగారంతో చేసారు.రాణీ హారాలు ,వింటేజ్ నకలెస్ లు ,ఖరీదైన రత్నాలు పొదిగిన బట్టలు , రాజస్థాని తరహా కడియాలు, పెద్ద ముక్కుపుడకలు,జుంకాలు ఇవన్నీ దీపిక అందాన్ని వంద రెట్లు పెంచాయి. ఈ ఆభరణాలు తయారీ పర్యవేక్షించిన కేతి రావత్ ఈ కథ 13,14 శతాబ్దం కు సంబంధించింది కనుక అప్పట చరిత్ర పుస్తకాలు మహారాజులకు సంబంధించిన ఎన్నో జెవెలరీ బుక్స్ వెతికి , దేశమంతా తిరిగి మ్యూజియం లలో ఎన్నో విషయాలు సేకరిస్తేనే ఇలాంటి నగలు తయారయ్యాయి.కుందన, మనకారి జ్యుయలరీ కోసం ఎంతో కష్టపడ్డారు. ఇంత బరువైన నగలు, వస్త్రాలు ధరించిన దీపికా తన ముఖం పై ప్రశాంతత చేరగానీయలేదట

Leave a comment