Categories
రిటైర్ మెంట్ వయసులో మోడలింగ్ మొదలుపెటట్టాం గర్వంగా ఉంది అంటుంది ముక్తా సింగ్. ఫైటర్ పైలెట్ ని పెళ్లి చేసుకొని కుటుంబ బాధ్యతల్లోనే ఏళ్ళు ఏళ్ళు గడిపేసింది 60 ఏళ్లు దాటాక ఒక ఫ్యాషన్ డిజైనర్ తన డ్రెస్ లకు మోడలింగ్ చేయమని ముక్త ని కోరడంతో ఆమె జీవన గమనం మారిపోయింది. చిన్నప్పటి నుంచి ఎన్నో పనులున్నా ఫిట్ నెస్ పైన శ్రద్ధ పెట్టడం నాకు కలిసి వచ్చింది. పెరిగే వయసుని స్వీకరించాలి అలాగే మనదైన ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని చూపటము నేర్చుకోవాలి. ఈ కొత్త ఇన్నింగ్స్ నాలో చాలా గర్వాన్ని పెంచింది అంటుంది ముక్తా సింగ్. ఆమె కళాకారిణి రచయిత్రి కూడా.