Categories
ఆరోగ్యం కోసం ఆహారంలో కొన్నింటిని చేర్చుకోవాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్.బియ్యంతో చేసిన ఇడ్లీ దోసెల కు బదులు జొన్నలు మినుములతో చేసిన ఇడ్లీ దోసె వారానికి ఒకసారి తినాలి దోసెలు అట్లు కు నూనె బధలు నెయ్యి వాడాలి. మొలకెత్తిన గింజలు తింటే ఆరోగ్యానికి మంచిది. ఉడకబెట్టిన శనగలు, వేరుశనగలు తింటే కూడా మంచిదే. పూరీలు, బోండాలు, వడలు నెలకోసారి తినటం ఉత్తమం ఒకటి రెండు సార్లు చపాతీలు నేతితో కలిపి తినాలి. ఏడెనిమిది గంటల మధ్యలో డిన్నర్ ముగించాలి. ముడి బియ్యం తృణధాన్యాలు ఆరోగ్యానికి మంచివి జొన్న అన్నం కొర్ర అన్నం రాగి సంగటి లో ఎన్నో పోషక పదార్థాలు ఉన్నాయి.