ఝాన్సీ లక్ష్మీబాయి కాశీలో ఒక బ్రహ్మాణ కుటుంబంలో పుట్టింది.ఆమె అసలు పేరు మణికర్నిక. 1842లో ఝాన్సీ మహరాజు గంగాధరరావు నేవాల్కర్ ను పెళ్ళాడి పేరి ఝాన్సీ లక్ష్మీబాయిగా మార్చుకుంది.ఈ దంపతులకు పుట్టిన బిడ్డ మరణించడంతో ఇంకో బిడ్డను దత్తత తీసుకున్నారు.ఈ దత్తత చెల్లదని బ్రిటీష్ గవర్నర్ డల్హౌసి వారసులు లేని సంస్థానంగా ఝాన్సీని కలుపుకోవాలని ప్రయత్నిస్తే సహించలేని ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటు చేసింది. ఆరునెలలు ఝాన్సీ కోట బ్రిటీష్ వారి వశం అయింది. లక్ష్మీబాయి బ్రిటీష్ వారికి చిక్కలేదు.పురుషుడి వేషంలో బిడ్డను వీపుకు కట్టుకుని తప్పించుకుంది. గ్వాలియర్ చేరి అక్కడ బ్రిటీష్ వారి పై యుద్దం చేసింది.ఈ పోరులో బ్రిటీష్ వారు ఆమెని కాల్చి చంపారని కొందరు లేదు గుర్రంతో తానే కొండచరియల పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని కొందరు అంటారు.ఆమె శవం దొరకలేదు. ఇదే మణికర్ణిక పేరుతో వస్తున్న కంగనా రనౌత్ నటిస్తున్న సినిమా కథ.మరి సినిమాలో మార్పులేమిటో వచ్చాక చూడాలి.