Categories
వయసు పెరుగుతున్న కొద్దీ ఒళ్ళు తగ్గించుకొవటం ,ముఖ్యంగా పొట్ట చుట్టు చేరే కొవ్వు తగ్గించుకోవటం చాలా కష్టం. ఎక్కువ తినటం ,కదలకుండా విశ్రాంతింగా కూర్చోవటం దీనిక కారణం. పొట్ట చుట్టు కొవ్వు తగ్గాలంటే తక్కువ ఆహారాన్ని ఎక్కువ సార్లు తినాలి. వేపుళ్ళు, కూట్ డ్రింక్ లు మానేయాలి. టీనేజీ వాళ్ళతో పోలీస్తే పెద్దవాళ్ళు అధిక బరువు తగ్గించుకోనేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఆఫీస్, ఇల్లు పెరుగుతున్న పనిగంటలు ,అదనపు బాధ్యతలు లేదా ఇల్లాలికి కూడా ఇక వయసు దాటాకా పిల్లల పెళ్ళిళ్ళు పురుళ్ళు పెరుగుతున్న వన్నీ సహాజంగానే ఒత్తిడి తెస్తాయి. వత్తిడిలో కనిపించిన వన్ని తినేస్తూ వ్యాయమం మానేస్తే పొట్ట చుట్టు కొవ్వు చేరుతుంది. కనుక ఈ అధిక బరువు తగ్గించుకోవాలి.