1921లో గాంధీజీ బెజవాడలో మహిళా సమావేశానికి హాజరు అయ్యారు. ఆయనను మా ఊరు ఏలూరు రావాలని కోరింది మాగంటి అన్నపూర్ణాదేవి. కాంగ్రెస్ నిధికి తన నగలు ఇచ్చి ఆ విరాళాలు ఇచ్చే సంప్రదాయం మొదలు పెట్టించింది అన్నపూర్ణ. ఆమె తల్లిదండ్రులు కలగర రామస్వామి, పిచ్చమ్మ లు బ్రహ్మ మతాన్ని అనుసరించి అన్నపూర్ణను కోల్కతా లోని బ్రహ్మ బాలిక పాఠశాలలో చదివించారు. బెంగాలి సాహిత్యాన్ని అనువాదం చేస్తూ ఆ వచ్చిన డబ్బుతో చదువుకున్నది అన్నపూర్ణ. అరవిందుని లేఖలు వంటి గొప్ప సాహిత్యం అనుసరించింది. గాంధీజీ పిలుపుతో ఏలూరు వచ్చి దాచుకున్న డబ్బుతో రాట్నాలు కొని పంచారు. గాంధీ ఆమెను కన్నబిడ్డల చూశారు. 27 ఏళ్ల వయసులో ఝాన్సీ లక్ష్మీబాయి అన్న పాపకు జన్మనిచ్చి అనారోగ్యంతో వారం రోజుల్లోనే  చనిపోయింది అన్నపూర్ణ. ఆమె భర్త నేతాజీ తో కలిసి కోల్కత్తా లో చదువుకున్నారు.

Leave a comment