Categories
కాఫీ మాస్క్ తో మొహం మెరిసిపోతుంది అంటారు బ్యూటీ ఎక్సపర్ట్స్. ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడి కి అదే పరిమాణంలో తేనె కలిపి మొహానికి మాస్క్ వేసుకొని 28 నిమిషాలు ఆరనిచ్చి కడిగేస్తే చర్మం పై ఉండే మృతకణాలు పోయి మొహం మెరిసిపోతుంది. అలాగే కాఫీ పొడి పాలలో కలిపి మాస్క్ వేసుకుంటే పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అలాగే కాఫీ పొడి బ్రౌన్ షుగర్,కొబ్బరి నూనె మిశ్రమం కూడా ముఖాన్ని మెరిపింప చేస్తుంది.