Categories
చర్మతత్వానికి సరిపోయే కన్సీలర్ ఎంచుకొంటే చాలు ,హెవీ మేకప్ లేకుండానే మొహం పైన నల్లమచ్చలు మొటిమలు లేకుండా చేయచ్చు అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . అన్ని సీజన్ లకు ఒకే కన్ సీలర్ సరిపోదు ,వేసవి శీతాకాలాల్లో రెండు షేడ్స్ ఉన్నా కన్ సీలర్ ని ,మిగతా రోజుల్లో రెండింటినీ కలిపి వాడితే స్కిన్ టోన్ చక్కగా సరిపోతుంది . మిగతా రోజుల్లో రెండింటినీ కలిపి వాడిలి . పసుపు రంగు కన్ సీలర్తో ఎర్ర మచ్చలు ,కళ్ళకింద వలయాలు కనిపించవు . ఆకుపచ్చ కన్ సీలర్తో మొటిమల మచ్చలు కనబడకుండా పోతాయి . కన్ సీలర్లు వెలుతురు పడుతున్న చోట నిలబడి వాడితే చర్మానికి ఏ రంగు సరిపోతుందో తెలుస్తుంది . కన్ సీలర్ ను చేతితో అంటుకోకుండా సింథటిక్ బ్రష్ తో కళ్ళ కింద చుక్కలు పెడుతూ మేకప్ బ్రష్ తో స్ప్రెడ్ చేయాలి .