వయసుకు తగ్గట్టు శరీరానికి పోషకాలు అందేలా చూసుకోవాలి అంటున్నారు న్యూట్రీషనిస్ట్ లు 20 నుంచి 30 ఏళ్ళ వయసులో శరీరతత్వం ,ఆకలిని బట్టి ఆహారం తీసుకోవాలి ఎక్కువేం అక్కర్లేదు . ఆహారంలో విటమిన్లు మినరల్స్ ఉండాలి . తృణ ధాన్యాలతో చేసిన చిరుతిండ్లు ఎండుఫలాలు ,పొద్దుతిరుగుడు గింజలు ,క్యారెట్లు ,పాలు అన్ని అవసరమే . వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్నిస్తాయి . చర్మ సంబంధ సమస్యలు రావు . రక్త హీనత రాకుండా పోలిక్ యాసిడ్ ,ఇనుము,విటమిన్ బి-12 ఉండే పదార్దాలు తీసుకోవాలి . చక్కగా ప్రతిరోజు వ్యాయామం చేయాలి . గర్భం దాల్చాలి అనుకొంటే ఫోలిక్ యాసిడ్ అందేలా ఆకు కూరలు ,నారింజ ,బీట్ రూట్ ,బీన్స్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి .

Leave a comment