గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ సైనిక దళానికి చెందిన మహిళ కాంతి కాంటింజెంట్ కమాండర్ కెప్టెన్ ప్రీతి చౌదరి సైనిక కవాతకు నేతృత్వం వహించారు. ఇందులో భాగంగా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ షిల్కా ఆయుధ  వ్యవస్థకు కెప్టెన్ ప్రీతి ముందుండి నడిపించారు.ఈ వ్యవస్థకు శత్రు స్థావరాలను రెండు కిలోమీటర్ల దూరం నుంచే మట్టుపెట్టే సామర్ధ్యం ఉంది.ఆధునిక రాడార్లు, డిజిటల్ ఫైర్ కంట్రోల్ కంప్యూటర్స్ తో ఆధునీకరించిన షిల్కా ఆయుధ వ్యవస్థ భూమి పై రెండు కిలోమీటర్లు గాలిలో రెండున్నర కిలోమీటర్ల దూరాన ఉన్న శత్రు స్థావరాలను తునాతునకలు చేయగలదు.

Leave a comment