డిప్రషన్ లో వున్న వారికి మందులు చికిత్స కన్నా ఆత్మీయులు, బంధువుల అభిమానం ఎక్కువ ఉపయోగ పడుతుందని. పరిశోధనలు చెప్పుతున్నాయి. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంచేందుకు సాయపాడేది స్నేహమే. ఒక వయస్సు ఒకేలా ఆలోచించడం ప్రేమను పంచడం ఇవన్నీ మానసిక ప్రశాంతతను ఇచ్చి డిప్రెషన్ నుంచి దూరం చేస్తాయని చెపుతున్నారు. కష్టాల్లో తోడుగా వుంటూ, మనను అర్ధం చేసుకుంటూ తప్పుదారిన నడిస్తే మందలిస్తూ, మంచి పని చేస్తే మెచ్చుకుంటూ, స్నేహితుడి బాధ్యత, సాన్నిహిత్యం ఏ మనిషికైనా కొండంత బలమే అంటున్నాయి అధ్యయనాలు. ఒకళ్ళని గురించి ఇంకొకళ్ళు పట్టించుకునే తీరిక ఓపిక లేని ఈ రోజుల్లో వ్యక్తి గత పరిసోధనలకి రాగలిగిన ఒక్క స్నేహితుడు వుంటే ఎన్నో మానసిక సమస్యలు దూరంగా వుంటాయి అంటున్నారు. అందుకే స్నేహం అపూర్వం. అనుభూతులు, భావోద్వేగాలు పంచే స్నేహితుల్ని ఎంత కష్ట సమయం లోనూ చేజార్చుకొ వద్దు అంటున్నారు. ఒక వేళ మన వైపు నుంచి అవతల స్నేహితులకు కాస్త కష్టం కలిగిన వెంటనే సారీ చెప్పడంలో తప్పేం లేదు అంటున్నారు. అలవాట్లు, అభిరుచులు కలసిన వెంటనే సారీ చెప్పటంలో తప్పేం లేదంటున్నారు. అలవాట్లు, అభిరుచులు కలసిన మంచి ఫ్రెండ్ వుండటం జీవితానికో నిండుతనం కుడా.

Leave a comment