అందమైన డ్రెస్సులతోపాటు వాటికి తగ్గ నగలు వెతుక్కోవటం కూడా శ్రమే. అందుకే కుర్తీల పై అందమైన నగల డిజైన్లు చేర్చారు డిజైనర్లు. సాధారణంగా కుర్తీలు, లెనిన్,కాటన్, క్రేప్ వంటి వస్త్రాలతో తయారు చేస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాల కోసం సిల్క్ పట్టు వస్త్రాల కూడా వాడతారు ఫ్యాషన్ డిజైనర్లు. ఈ కుర్తీల పైన హారాలు డిజైన్ చేశారు. పొడగాటి గొలుసులు నెక్లెస్ లు లాగా దూరంగా చూస్తే అచ్చం నగల్లాగా ఉండే ఈ కుర్తీల డిజైన్లు చూస్తే అమ్మాయిలు ఆహా అనేశారు పైగా అచ్చం నగల కంటే ఈ కుర్తీలపైనే నగలు, కుందన్లు, రాళ్లు కలిసి మెరుపులు మెరుస్తున్నాయి. ముత్యాల వర్సల్లాగా పొడవాటి హారాలు లాగా ఈ డిజైన్ లు ఎంతో అందంగా ఉన్నాయి.

Leave a comment