Categories
ఎప్పుడు ఒకే రకం చీరలేనా ? కాస్త వెరైటీ ఉండదా? పట్టు,కాటన్,జార్జెట్,కోట ఎన్నిసార్లు కట్టుకోలేదు. ఇప్పుడే ఏదైనా కొత్త వెరైటీ కావాలా అనుకుంటే అమ్మాయిల కోసం వచ్చాయి ప్లీటెడ్ క్రష్డ్ చీరలు ఎలాంటి డిజైన్ లేని సాదా చీరలకు చిన్న మడతలు పెట్టినట్లు కనిపించే ఈ చీరలు ఇవ్వాల్టి ఫ్యాషన్. జార్జెట్,సిల్క్ లతో ఈ ప్లేటెడ్ క్రష్డ్ సారీస్ చక్కని డిజైనర్ బ్లౌజ్ తో కలిసి కొత్త అందాన్ని ఇస్తున్నాయి. అందమైన నలుపు, ఎరుపు వంటి ముదురు రంగులు తేలికైన బంగారు రంగుల తో ఈ క్రష్డ్ సారీస్ ఇవ్వాల్టి ఎంపిక కలగలిపిన రంగులతో ఈ ఇంద్రధనస్సు వంటి చీరలను పార్టీ వేర్ గా ధరిస్తున్నారు.