2029 నుంచి భారతదేశంలో మహిళా ఓటర్ల సంఖ్య అధికం అవనున్నదని ఎస్.బి.ఐ నివేదిక చెబుతోంది. 2024 లో జరుగునున్న సార్వత్రిక ఎన్నికల్లో నివేదిక మొత్తం 68 కోట్ల మంది ఓటర్లను అంచనా వేసింది. అందులో మహిళా ఓటర్లు 49 శాతంగా అంటే 33 కోట్ల మంది ఉన్నారని నివేదిక పేర్కొన్నది గత దశాబ్ద కాలంలో భారతదేశ రాజకీయ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళల ఓటింగ్ శాతం పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ల  సవరణ జాబితాను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మహిళా ఓటర్లు పురుషుల కంటే 1,40,112 మంది ఎక్కువ. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉన్న ఓటర్ల కంటే ప్రస్తుతం 7,19,104 మంది ఓటర్లు పెరిగారు రాష్ట్రంలో 80 ఏళ్లు దాటిన ఓటర్లు 4,54,230 మంది కాగా,దివ్యంగులు 5,24,230 మంది ఉన్నారు. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మహిళల నిర్ణయమే కీలకంగా చట్టసభల్లో గెలుపు, ఓటములు ఉంటాయని ఒక నివేదిక చెబుతోంది ఎందుకంటే రాష్ట్రం లోని ఓటర్ల లో మహిళలే మెజార్టీ గా నిలిచారు.

Leave a comment