భారత దేశ తొలి మహిళా మావటి పర్బతి బారువాకు భారత ప్రభుత్వం పద్మశ్రీ బహుకరించి గౌరవించింది. మన దేశం లోనే కాదు ఆసియాలోని ప్రమాద స్థాయిలో పడిపోతున్న గజరాజుల సంరక్షణ కోసం వాటిని ఎలా కనిపెట్టుకొని ఉండాలో తెలుసుకొని ఇన్నాళ్లుగా వాటిని సంరక్షిస్తున్న పర్బతి అస్సాం అటవీశాఖ లో చీఫ్ ఎలిఫెంట్ వార్డెన్ గా పనిచేసింది. మావటి పని డ్రైవర్ ఉద్యోగం చేసినట్లు పనిగంటలతో ఉండదు ఏనుగు కు మావటి అనుక్షణం తోడు ఉండాలి అంటుంది పర్బతి. బిబిసి ఆమెపైన క్వీన్ ఆఫ్ ఎలిఫెంట్ పేరుతో డాక్యుమెంటరీ తీశారు.

Leave a comment