తొలిసారి తల్లి కావడం మధురస్మృతి. కాని ఆ సమయంలో శరీరంలో జరిగే మార్పులకు బిడ్డను కనే సమయంలో కలిగే బాధను తలుచుకుని గర్భిణీగా ఉన్న స్త్రీలు చాలా మంది ఎంతో భయపడతారు. పెద్దవాళ్ళు పక్కనే ఉండి ఆ భయం పోగొడతారు. అలాంటి అవకాశం లేకపోతే వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. అప్పుడు వైద్యులు ఇచ్చే యాంటీ డిప్రెషన్ మందుల ప్రభావం పెరిగి శిశువుల పైన ఉంటుంది. మెదడు లోని భావోద్వేగాల నియంత్రణ భాగం పైన ఈ మందుల ప్రభావం పడుతుంది. పుట్టాక కూడా పిల్లల పై ఈ ఆదుర్ద ప్రభావం ఉంటుంది. ఇది ఈ మధ్య కాలంలో వచ్చిన రిపోర్టు. అందుకే తల్లి కాబోతున్న వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. అనుమానాలు కలిగితే పెద్ద వాళ్ళ దగ్గర లేకపోతే వెంటనే డాక్టర్లను కలిసి సందేహాలు తీర్చుకోవాలి.

Leave a comment