ఈ ఏడాది వరస హిట్స్ అన్నీ కాజల్ వే. అగ్ర కథానాయక అనిపించుకోవటం అంత ఈజీ ఏం కాదు. అందం అభినయం అదృష్టం అన్నీ కలిసి రావాలి. స్టార్ హీరోల తో పాటు పోటీగా నటించగలగాలి. కధానాయిక  ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు న్యాయం చేయాలి. కాజల్ కి ఈ లక్షణాలన్నీ వున్నాయి. కనుకనే చిరంజీవి ఖైదీ నెంబర్ 150 లో నటించగలిగింది. ఎంతో మంది వడపోత తర్వాతే కాజల్ ని ఎంచుకున్నారు. క్రిస్మస్ కి రిలీజ్ చేసిన ఒక పాత సన్నజాజిలా పుట్టేసిందిరో అంటూ చిరంజీవి కాజల్ ని వర్ణిస్తూ పాడిన పాట  ఫాన్స్ ఫిదా అయ్యారు. ఏడేళ్లుగా   నటిస్తున్న నేను నా కెరీర్ చివరిదశకు వచ్చిందనుకోను. ప్రతి సినిమా నా తోలి సినిమా లాగే  భావిస్తాను.చేతిలో ఎన్ని విజయాలున్నా అశ్రద్దగా ఉండను. అంటూ వినయంగా చెప్పగలిగింది. కనుకే ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ సినిమాల్లోకొస్తున్న చిరంజీవి సినిమాలో హీరోయిన్  ఛాన్స్ దక్కించుకోగలిగిందామె. ఈ  చిత్రంలో పాటలన్నీ విన్నారా ?

Leave a comment