ప్రణవాలయ డాన్స్ చేస్తున్నప్పుడు నా ఎమోషన్ లు చెప్పేందుకు మాటలు సరిపోవు అంటుంది సాయి పల్లవి. శ్యామ్ సింగరాయ్ లో సాయి పల్లవి చేసిన ప్రణవాలయ పాట లోని శాస్త్రీయ నృత్యం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ పాట ద్వారా అద్భుతమైన డాన్సర్స్ తో కలిసి ప్రదర్శన ఇచ్చే అవకాశం లభించింది ఈ డాన్స్ గ్రూప్ లో వారంతా పది, ఇరవై ఏళ్లుగా క్లాసికల్ డాన్స్ చేస్తున్న వాళ్లు వాళ్లతో కలిసి ప్రదర్శన ఇచ్చే అవకాశం నాకు వచ్చింది .ఎంత కావాలో అంతే డాన్స్ ఉంటుంది నిజానికి నాకు క్లాసికల్ డాన్స్ రాదు నేర్చుకోలేదు కూడా. దర్శకులు నేను చేయగలదని నమ్మారు నేనీ గ్రూప్ లో ఉండగలిగాను అంటోంది సాయి పల్లవి.

Leave a comment