శీతాకాలంలో చక్కగా పూసే తీగ క్లిరో డెండాన్ స్ప్లీoడెన్స్ దాన్నే ఫ్లేమింగ్ గ్లోరీ బోయర్ అంటారు . చక్కగా ఈనెలలో కనిపించే పచ్చని ఆకులతో అండాకారంలో దట్టింగ్ ఎర్రని పూల గుత్తులకు ,ఒక్కో పూవు ఐదు రెక్కలతో మంచి సువాసనతో ఉంటుంది . సంవత్సరం మొత్తం పూస్తూనే ఉన్న శీతాకాలంలో ఇంకాస్త బాగా విరగభూస్తుంది . హమ్మింగ్ పిట్టలు ,సీతాకోక చిలుకలు ఈ పులచుట్టూ తిరుగుతాయి . ఆకురసాయనాలు వాడితే పెద్దగా చేద పట్టదు . అన్ని ఒకే రకంగా ఉన్న ఈ తిగాని చక్కగా పెంచితే వేగంగా పెరుగుతూ అల్లుకుపోయి పూస్తుంది వాడేసిన కాఫీపొడి ,టీ పొడి మట్టిమిశ్రమంలో కలిపినా బలం గా ఎదుగుతుంది . ప్రకాశవంతమైన ఎరుపు పూలగుత్తులతో చాలా అందమైన తీగ ఇది .

Leave a comment