ఇది వరకు వెండి తో కాళ్ళకు పెట్టుకునే పట్టీలు మాత్రమే పెట్టుకోనేవాళ్ళు. మోడ్రన్ డిజైనర్స్ ఆ ట్రెండ్ మార్చేసారు. ఘల్లున మోగే వెండి మువ్వల పట్టీలు కాస్తా మామిడి పిందెలతో రంగులు అద్దుకుని వడ్డానాలు అయిపోతాయి. ఇలాంటివే రెండు వరుసలు వస్తే నడుము పైన అమరిపోతాయి చీరకే అందాన్ని ఇస్తున్నాయి. క్రిస్టల్స్ ని కలుపుకుని అందమైన నగలు అవుతున్నాయి. మెటాలిక్ మెరుపులద్దుకుంటున్నాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ అందమైన తెల్లని నగలు ఫ్యాషన్ పరుగుల్లో ఒక్క అడుగు ముందే వున్నాయి.

Leave a comment