నీహారిక,

చాలా కరక్టయిన ప్రశ్న అడిగావు. మనకో లక్ష్యం తప్పని సరిగా వుండాలా? మన కధేమీటో ముందే  తలుస్తుందా? గుడ్. జీవితం లో జీవించి వుండేందుకు ప్రతి వ్యక్తికి తనదైన కారణం వుంటుంది. ఆ కారణమె జీవిత లక్ష్యం. దాన్ని మనం రుచి చూడాలి. నాతో ఏముంది ఒక లక్ష్యం సృష్టించేందుకు అనుకోని వాళ్ళకి వాళ్ళ బలం మీద వాళ్ళ ద్రుష్టి పెట్టలేదన్నదే సమాధానం. పుట్టి పెరిగేటప్పుడు మన సర్వెంద్రియాలు ఎదో ఒక ఇష్టంతో ఉంటాయి. ఆ ఇష్టాన్ని దక్కించుకోవడం మన లక్ష్యం ఐన్ స్టిన్, రామానుజం వంటి వాళ్ళు నేనేం చేయాలి అనుకుని కూర్చోలేదు. వాళ్ళలోని సృజన వాళ్ళకి తెలిసిపోయింది. అద్భుతమైన గణిత సమకరనాలకు సమాధానాలు రాబట్టారు ప్రపంచానికి ఏనికి వట్టి ఎన్నో వస్తువులు శూన్యం ఆలోచనలోంచి ప్రపంచానికి సృష్టించి ఇచ్చారు. మన లోపాల ఎదో ఒక ప్రతిభ వుంటుంది. అది ఒక వేల సమాజ హితం కోరేది అయితే మనం మన చుట్టూ వున్న వారికి అవసరాలు తీర్చెందుకే పుట్టిన పేర్లకు తక్షణం సకల సంపదలు మనకి వున్నాట్లే ప్రపంచానికి ఉపయోగ పడ్డామన్న తృప్తి కంటే విలువైన కానుక ఇంకేంముంటుంది చెప్పు. ఒక మనిషి పెదవుల పైన ఒక్క చిరు నవ్వును మనం సృష్టించి ఇవ్వాగలగడం కంటే లక్ష్యం ఏముండాలి?

Leave a comment