తమిళనాడు రాష్ట్రం లో ప్రజల శ్రేయస్సు కోసం వచ్చిన సంక్షేమ పధకాల విషయంలో తెర వెనక నుండి ఎంతో కృషి చేసిన గిరిజా వైద్యనాధన్ తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. తంజావూరుకు చెందిన గిరిజ తండ్రి ఎన్.వెంకట్రామన్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా విధులు నిర్వహించారు. 1981 లో సివిల్ సర్వీసెస్ లో చెరో వైద్య, వ్యవసాయ, రవాణా శాఖల్లో పని చేసారు. ఆమె శ్రద్ధ తీసుకుని కసరత్తు చేసిన ఆరు నెలల ప్రసూతి సెలవుల పెంపు నిర్ణయంతో మహిళల నుంచి నూరు శాతం మార్కులు సంపాదించారు గిరిజ. పదవీ విరమణకు ఇంకా ముడేళ్ళే సమయం వుండగా ఇప్పుడీ పదవికి ఎంపిక కావడం సంతోషించే విషయం.

Leave a comment