వాముని కిచెన్ కెమిస్ట్ అంటారు. ఘాటుగా వుండే వాసన కొంచెం కారంగా ..ఇంకొంచెం నోట్లో వేసుకుంటే మౌత్ ఫ్రెషనర్గా వాము ఒక మంచి ఔషధం మందు,బోలెడన్ని ఉదర సంబంధమైన సమస్యలకు సరైన సమాధానం కూడా. కిచెన్ గార్డెన్ లో వాము మొక్క పెంచుకోవచ్చు. మధ్యాహ్నం భోజనం తర్వాత రాత్రి డిన్నర్ తర్వాత నువ్వులు వాము నిమ్మరసం ఉప్పు కలిపి కాస్త వేడి చేస్తే వచ్చిన మిశ్రమాన్ని తింటే కడుపుకు సంబంధించి ఎన్టీజో ప్రయోజన కారి. జలుబు తలనొప్పి ఫ్లూ దగ్గు ఇతర సమస్యలు ఈ మిశ్రమంతోనే తగ్గించవచ్చు. ఆలా కారంగా  వుంటుందనే రుచిగా లేదనో తినలేకపోతే ఏరోటీ లో రోటీల పిండిలోనో కలుపుకోవచ్చు. వాటికి రుచి వాసన పెరగటం తో పాటు ఆరోగ్యము దక్కుతుంది. బీన్స్ వంటి కూరల్లో కూడా వాముపొడి జలుబు సెనగపిండితో చేసిన ఏ వంటకం తో అయినా వాము చేరిస్తేనే మంచిది.

Leave a comment