మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మన చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.దీనిని ఒక అలవాటుగా మార్చుకోవాలి.ఏదో కడుక్కున్నాంలే అన్నట్లుగా గబగబా చేతులు కడిగేసుకుంటారు. ఫలితంగా చేతులకు అంటుకున్న క్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌లు మనం తీసుకునే ఆహారం ద్వారా మన శరీరంలోకి చేరతాయి.సమస్త ఆరోగ్య సమస్యలకు ఇక్కడే బీజం పడుతుందని ఆరోగ్య నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో  వివిధ రకాల వ్యాధులను మోసుకొచ్చే ఈ వర్షాకాలంలో చేతుల శుభ్రత విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Leave a comment